'జీ 5'లో డిసెంబర్ 4న 'కోమాలి' ప్రీమియర్
- December 04, 2020
తెలుగు వీక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్, వెబ్ షోలు అందిస్తున్న ఓటీటీ వేదిక 'జీ 5'. లాక్‌డౌన్‌లో డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు... 'అమృతం ద్వితీయం' వెబిసోడ్స్‌తో వీక్షకులను ఎంటర్టైన్ చేశారు. డిసెంబర్ 4న మరో కొత్త సినిమాను తీసుకొస్తున్నారు. తమిళ హీరో 'జయం' రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'కోమాలి' శుక్రవారం 'జీ 5'లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రీమియర్ కానుంది.
పదహారేళ్లు కోమాలో ఉన్న ఓ వ్యక్తి మళ్లీ ఈ లోకంలోకి వస్తే? అనే కథాంశంతో 'కోమాలి' రూపొందింది. పదహారేళ్లకు, ఇప్పటికి సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. మారిన పరిస్థితులకు కథానాయకుడు అలవాటు పడ్డాడా? పదహారేళ్ల క్రితం సమాజంలో ఉన్న కథానాయకుడు చేసే పనులు ఏమిటి? అనేది ఆసక్తికరం. ఇదొక వినోదాత్మక చిత్రమని 'జీ 5' వర్గాలు తెలియజేశాయి.
'జయం' రవి కథానాయకుడిగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సంయుక్తా హెగ్డే సెకండ్ హీరోయిన్. స్కూల్ డేస్ లో హీరోని ప్రేమించిన అమ్మాయిగా, హీరో కోమా నుండి తిరిగొచ్చే సమయానికి మరొకరిని పెళ్లి చేసుకున్న మహిళగా కనిపిస్తారు. కమెడియన్ యోగిబాబు, హీరో జయం రవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ఎమ్మెల్యేగా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'హిప్ హాప్' తమిళ సంగీత దర్శకుడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







