GHMC ఎన్నికల్లో కొనసాగిన టీఆర్ఎస్ జోరు..

- December 04, 2020 , by Maagulf
GHMC ఎన్నికల్లో కొనసాగిన టీఆర్ఎస్ జోరు..

హైదరాబాద్:GHMC ఎన్నికల ఫలితాలలో ఎప్పటిలాగే కారు హవా కొనసాగింది. అత్యధికంగా 55 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ టీఆర్ఎస్ ఊహించినన్ని సీట్లను మాత్రం సాధించలేకపోయింది. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, ఎంఐఎం ఈ ఎన్నికల్లో గట్టి పోటినిచ్చాయి. దీంతో కారుజోరుకు బ్రేకులు పడినట్లయింది. సొంతంగా మేయర్ పీటం దక్కించుకోవడం కూడా కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 వార్డుల్లో గెలిచి ఏకపక్షంగా మేయర్ పీటం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి

అంబర్‌పేట ఇ.విజయ్‌కుమార్, అడ్డగుట్ట ఎల్. ప్రసన్నలక్ష్మి, అల్లాపూర్ సబిహా బేగం, అల్వాల్ సి.హెచ్.విజయశాంతి, ఆల్విన్ కాలనీ డి.వెంకటేశ్ గౌడ్, కాప్రా ఎస్.స్వర్ణరాజ్, కుత్బుల్లాపూర్ కె.గౌరీష్ పారిజాత, కూకట్ పల్లి జూపల్లి సత్యనారాయణరావు, కేపీహెచ్‌బీ కాలనీ ఎం.శ్రీనివాసరావు, కొండాపూర్ షేక్ హమీద్, ఖైరతాబాద్ పి. విజయారెడ్డి, గాజులరామారం రావుల శేషగిరి, గోల్నాక డి. లావణ్య, గౌతమ్‌నగర్ ఎం. సునీత, చందానగర్ ఆర్. మంజుల, చర్లపల్లి బొంతు శ్రీదేవి, చింతల్ రషీదాబేగం, చిల్కానగర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, జగద్గిరిగుట్ట కె.జగన్, తర్నాక ఎం.శ్రీలత, తూర్పు ఆనంద్‌బాగ్ వై.ప్రేమ్ కుమార్, నాచారం శాంతి సాయిజాన్ శేఖర్, పటాన్ చెరు మెట్టు కుమార్‌ యాదవ్, పాతబోయిన్‌పల్లి ఎం.నర్సింహ యాదవ్, ఫతేనగర్ పి. సతీశ్ బాబు, బంజారాహిల్స్ గద్వాల.ఆర్ విజయలక్ష్మి, బన్సీలాల్ పేట కుర్మ హేమలత, బాలాజీనగర్ పి.శిరీష, బాలానగర్ ఎ.రవీందర్ రెడ్డి, బేగంపేట టి. మహేశ్వరి, బోరబండ ఎండి బాబా ఫసియుద్దీన్, బౌద్ధనగర్ కంది శైలజ, భారతీనగర్ వి.సింధు, మచ్చబొల్లారం ఇ.ఎస్.రాజ్ జితేంద్రనాధ్, మల్లాపూర్ దేవేందర్ రెడ్డి, మాదాపూర్ వి.జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మీర్‌పేట హెచ్‌బీ కాలనీ జె. ప్రభుదాస్, మెట్టుగూడ ఆర్.సునీత, యూసఫ్‌గూడ బండారి రాజ్‌కుమార్, రంగారెడ్డినగర్ బి. విజయ్ శేఖర్, రహ్మత్‌నగర్ సి. ఎన్.రెడ్డి, రామచంద్రాపురం బి.పుష్ప, వివేకానందనగర్ కాలనీ మాధవరం రోజాదేవి, వెంకటాపురం సబితా కిషోర్, వెంకటేశ్వర కాలనీ మన్నె కవితారెడ్డి, వెంగళరావునగర్ జి.దేదీప్య, శేరిలింగంపల్లి ఆర్.నాగేందర్ యాదవ్, సనత్‌నగర్ కొలను లక్ష్మి, సీతాఫల్‌మండి సామల హేమ, సుభాష్‌నగర్ జి. హేమలత, సూరారం మంత్రి సత్యనారాయణ, సోమాజిగూడ వనం సంగీత, హఫీజ్ పేట వి. పూజిత, హైదర్‌నగర్ ఎన్.శ్రీనివాసరావులు గెలుపొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com