తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- April 30, 2024
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణలో దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. బాలికలే పై చేయి సాధించారు. ఫలితాలను bse.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు.
పదో తరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది
బాలికల ఉత్తీర్ణత శాతం 93.23 గా ఉంది. బాలుర ఉత్తీర్ణత శాతం 89.42గా నమోదైంది
నిర్మల్ జిల్లా 99.09 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. వికారాబాద్‌లో అత్యల్పంగా ఉత్తీర్ణత శాతం 91.31 శాతంగా నమోదైంది. 3వ స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా హైదరాబాద్‌లో ఉత్తీర్ణత శాతం 91.31.
3,927 పాఠశాలల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతను సాధించారు
తెలంగాణ గురుకులాల్లో 98.71 శాతం ఉత్తీర్ణత
ఆరు ప్రైవేటు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత
జిల్లా పరిషత్ గవర్నమెంట్ పాఠశాలల్లో 91.31 శాతం ఉత్తీర్ణత
పదో తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మూడో తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి.
పదో తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. పరీక్షలు రాసిన వారిలో బాలురు 2 లక్షల 57వేల 952 మంది, బాలికలు 2 లక్షల, 50 వేల 433 మంది ఉన్నారు. సుమారుగా 30వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 20లోగా ముగించారు.
మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియను చేపట్టింది విద్యాశాఖ. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకుని ఫలితాలను వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







