ఒరేయ్ ! కాపలా కుక్క
- February 18, 2016
ప్రతీ సందులో
నక్కలనీ.. ఉరేగిస్తూ
పందుల సందడి పండగవుతుంటే
గద్దలే
విశాల గగనంలో
విశ్వ మానవతా సుక్కలవుతుంటే
ఛల్ భే ఛల్ ఎవడు చెప్పాడ్రా నీకు !
దేశమంటే జాతి గౌరవమని
అమ్మలాంటి ఆత్మ గౌరవమని
దేశమంటే మట్టేరా
దేశమంటే మనుషులేరా
అవసరమైనప్పుడల్లా
ప్రతీ ‘వాదాన్నీ’ వేదంలా చెప్పుకొని బతకాల్రా
ఒరేయ్ ! కాపలా కుక్క
నాలాగే నీకు అమ్మ నాన్నా
నాలాగే నీకు అన్నా తమ్ముడు
నాలాగే నీకు అక్కా చెల్లెలు
నాలాగే నీకు పెండ్లాం పిల్లలు
లేనందుకేనా వట్టి మట్టిని ప్రేమిస్తున్నావ్
సరిహద్దుల్లో నీకేం పని
పీనుగై ఏనుగులా ఊరేగే కోరికేగా
~ పారువెల్ల ~
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









