పట్టణ శివార్లలోని బంగళాలకు " మై హోం " తపాల పెట్టెల అందజేత

- February 19, 2016 , by Maagulf
పట్టణ శివార్లలోని బంగళాలకు

పట్టణ శివార్లలోని మారుమూల ఉన్న బంగళాలకు " మై హోం " తపాల పెట్టెలను ఎమిరేట్స్ తపాల శాఖ ద్వారా అందచేయనున్నారు. ఈ సేవలను పొంధగోరేవారికి వారి స్వంత చిరునామాతో ఈ తపాలపెట్టేలను అందచేస్తారు. ఏదైనా ఉత్తరాలు వచ్చినపుడు వారి గృహానికి అమర్చిన ఈ తపాలపెట్టేలలో పోస్ట్ మాన్  జారవిడుస్తారు. ఈ " మై హోం " తపాల పెట్టెలను బంగళా ప్రధాన ద్వారం ముందు ఉన్న ప్రహరి గేటుకు వేలాడదీస్తారు. ఈ తపాల పెట్టెలో రెండు అరలు ఉంటాయి. అందులో ఒకటి దూరం నుంచి వచ్చిన ఉత్తరాలకు కేటాయిస్తారు. అందులో ఉన్న మరో అరలో బంగళాలో  వారు రాసిన ఉత్తరాలను ఉంచవచ్చిని , వాటిని  తపాల ఉద్యోగే వేరే ప్రాంతానికి బట్వాడా నిమిత్తం తీసుకొని వెళతాడు. గృహ యజమాని ఆయా పరిధిలోని పోస్ట్ మాన్ తో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం తపాల సేవలు ప్రతి రోజు కావాలా లేక వారంలో 3 సార్లు కావాలో నిర్ణయించుకోవాల్సి ఉంది. ఈ " మై హోం " తపాల పెట్టెల సౌలభ్యం కోసం ఒక ధరఖాస్తును పూర్తిచేసి స్థానిక తపాలా కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు.  ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేయాలను కోనేవారు " ఇ.పి.జి." వెబ్ సైట్ లో సందర్శించి పంపాలని తెలిపారు. ధరఖాస్తులు అందిన వారం రోజులలో సంబంధిత గృహ యజమాని ఇంటి ద్వారంకు " మై హోం " తపాల పెట్టెలను అమర్చుతారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com