పట్టణ శివార్లలోని బంగళాలకు " మై హోం " తపాల పెట్టెల అందజేత
- February 19, 2016పట్టణ శివార్లలోని మారుమూల ఉన్న బంగళాలకు " మై హోం " తపాల పెట్టెలను ఎమిరేట్స్ తపాల శాఖ ద్వారా అందచేయనున్నారు. ఈ సేవలను పొంధగోరేవారికి వారి స్వంత చిరునామాతో ఈ తపాలపెట్టేలను అందచేస్తారు. ఏదైనా ఉత్తరాలు వచ్చినపుడు వారి గృహానికి అమర్చిన ఈ తపాలపెట్టేలలో పోస్ట్ మాన్ జారవిడుస్తారు. ఈ " మై హోం " తపాల పెట్టెలను బంగళా ప్రధాన ద్వారం ముందు ఉన్న ప్రహరి గేటుకు వేలాడదీస్తారు. ఈ తపాల పెట్టెలో రెండు అరలు ఉంటాయి. అందులో ఒకటి దూరం నుంచి వచ్చిన ఉత్తరాలకు కేటాయిస్తారు. అందులో ఉన్న మరో అరలో బంగళాలో వారు రాసిన ఉత్తరాలను ఉంచవచ్చిని , వాటిని తపాల ఉద్యోగే వేరే ప్రాంతానికి బట్వాడా నిమిత్తం తీసుకొని వెళతాడు. గృహ యజమాని ఆయా పరిధిలోని పోస్ట్ మాన్ తో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం తపాల సేవలు ప్రతి రోజు కావాలా లేక వారంలో 3 సార్లు కావాలో నిర్ణయించుకోవాల్సి ఉంది. ఈ " మై హోం " తపాల పెట్టెల సౌలభ్యం కోసం ఒక ధరఖాస్తును పూర్తిచేసి స్థానిక తపాలా కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేయాలను కోనేవారు " ఇ.పి.జి." వెబ్ సైట్ లో సందర్శించి పంపాలని తెలిపారు. ధరఖాస్తులు అందిన వారం రోజులలో సంబంధిత గృహ యజమాని ఇంటి ద్వారంకు " మై హోం " తపాల పెట్టెలను అమర్చుతారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్‌కు సర్వంసిద్ధం..
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి