ఉప్పెన లోని "నీ కన్ను నీలి సముద్రం" పాటకు 150 మిలియన్ వ్యూస్
- December 07, 2020
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా, ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్టయిన "నీ కన్ను నీలి సముద్రం" సాంగ్ లేటెస్ట్గా మరో మైలురాయిని అందుకుంది. శ్రీమణి, రఖీబ్ ఆలమ్ రాయగా, జావెద్ అలీ, శ్రీకాంత్ చంద్ర పాడిన ఈ సాంగ్ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఈ పాటను వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటపై చిత్రీకరించారు.
ఇటీవల విడుదలైన 'ధక్ ధక్', 'రంగులద్దుకున్న' పాటలు కూడా మ్యూజిక్ లవర్స్‌ను బాగా అలరిస్తున్నాయి. తన మ్యూజిక్ టేస్ట్‌తో, పాటలను ప్రెజెంట్ చేసిన విధానంతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను అందిస్తున్నారు.
తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న 'ఉప్పెన' చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం:
పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సీఈవో: చెర్రీ
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనిక రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







