అబుధాబిలో ట్రాఫిక్ రాడార్స్, రూల్స్ బ్రేక్ చేస్తే బుక్కైపోతారు!
- December 08, 2020
అబుధాబి:అబుధాబి రోడ్లపై సీట్ బెల్టు పెట్టుకోకుండా కారులో వెళ్తున్నారా? మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారా? అయితే..జనవరి 1 నుంచి జర భద్రం. సీటు బెల్టు పెట్టుకోకుండా...ఫోన్ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు ఆటోమెటిక్ సిస్టమ్ రాడార్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అబుధాబి డిజిటల్ అథారిటీ ప్రకటించింది. వెహిక్యూలర్ అటెన్షన్ అండ్ సెఫ్టీ ట్రాకర్ అని పిలిచే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ట్రాకర్...రోడ్డుపై వెళ్లే వాహనం ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసిన మరుక్షణం కమాండ్ సెంటర్ కు మెసేజ్ పంపిస్తుంది. అలాగే కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సీటు బెల్టు పెట్టుకోకున్నా..ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నా..వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా పసిగట్టేస్తుంది. రాజధాని నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అరికట్టడం, వాహనదారులకు భద్రతను పెంచే లక్ష్యంతో ట్రాకర్స్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







