ఫైన్ లేకుండా ఒమన్ వదిలివెళ్లనున్న 2000 మంది ఇండియన్స్
- December 08, 2020
వర్క్ పర్మిట్ గడువు ముగిసిన దాదాపు 2000 మంది భారతీయులు ఒమన్ విడిచి వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
వారిలో సరైన పాస్ పోర్ట్ లేని 500 మందికి ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్లను కూడా జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వర్క్ పర్మిట్ ముగిసిన వారు శాశ్వతంగా ఒమన్ విడిచి వెళ్లేందుకు వీలుగా..డిసెంబర్ 31 వరకు క్షమాభిక్ష గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31 లోగా దేశం విడిచి వెళ్తే..ఎలాంటి ఫైన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో సరైన అనుమతులు లేని వారు క్షమాభిక్ష గడువును సద్వినియోగం చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం పిలుపునిచ్చింది. అటు భారత ప్రభుత్వం కూడా ఈసీ జారీ కోసం ఫీజు మినహాయింపులు ఇస్తోందని, రిజిస్టర్ చేసుకున్నవారికి కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాగానే ఈసీ కోసం పాస్ పోర్టు/వీసా జారీ చేసే ఏదైనా బీఎల్ఎస్ సెంటర్ లో సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







