కోట్ల జి-సెక్స్‌ బైబాక్‌...

- February 19, 2016 , by Maagulf
కోట్ల జి-సెక్స్‌ బైబాక్‌...

మార్కెట్లకు నగదు లభ్యతను అందుబాటులోనికి తెచ్చేందుకుగాను ప్రభుత్వం ద్రవ్యోల్బణసూచి ఆధారితబాండ్లు, సెక్యూరిటీలను బైబాక్‌ చేయాలని నిర్ణయించింది. రూ.18,990 కోట్ల రూపాయలు విలువైన బాండ్లను ఈనెల 22వ తేదీ కొనుగోలుచేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. 1.44శాతం ద్రవ్యోల్బణసూచి ప్రభుత్వ స్టాక్‌ 2023లో రివర్స్‌ వేలం ద్వారా 3990.72 కోట్ల రూపాయల ముఖ విలువ ఉన్న బాండ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. మరో ప్రకటనలో ప్రభుత్వం 2016 సిరీస్‌లోని సెక్యూరిటీలను తిరిగి కొను గోలుచేస్తామని, 15వేలకోట్ల విలువైన బాండ్లు కొనుగోలు జరుగుతుందని వెల్లడించింది. మిగులు నగదు నిల్వలను వినియోగించుకుంటూ ప్రభుత్వ రంగ స్టాక్స్‌ను బైబాక్‌ చేయడం, ప్రభుత్వ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలుచేయడం జరుగుతుందని ప్రకటించింది.
వేలం ఫార్మాట్‌లోనే కొనుగోళ్లు ఉంటాయి. ఎల క్ట్రానిక్‌ ఫార్మాట్‌లో రిజర్వుబ్యాంకు కోర్‌బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ ఇక్యూబర్‌ వ్యవస్థద్వారా జరుగుతుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు వేలం జరుగుతుందని అంచనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com