కోవిడ్ వ్యాక్సిన్: అబుదాబీ రెసిడెంట్స్‌కి రిజిస్ట్రేషన్
- December 10, 2020
అబుదాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) కాల్ సెంటర్ (80050), కరోనా వ్యాక్సిన్ తొలి డోసు పొందాలనుకుంటోన్న అబుదాబీ రెసిడెంట్స్ కోసం అపాయింట్మెంట్ సౌకర్యం కల్పిస్తోంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలాగే క్లినిక్స్‌లో ఈ వ్యాక్సిన్ అభ్యమవుతుంది. తొలి డోస్ ఇచ్చిన 21 రోజుల తర్వాత మలి డోస్ వుంటుంది. ఎవరైతే వ్యాక్సిన్ పొందాలనుకుంటారో, వారు తమ ఎమిరేట్స్ ఐడీ డిటెయిల్స్‌ని సమర్పించాల్సి వుంటుంది. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లేదా క్లినిక్‌కి సంబంధించిన అపాయింట్‌మెంట్‌ని బుక్ చేస్తారు. కాగా, చైనాకి చెందిన సినోఫామ్ వ్యాక్సిన్ సమర్థతని 86 శాతంగా పేర్కొంది. కరోనా ప్రభావాన్ని చాలావరకు ఈ వ్యాక్సిన్ తగ్గిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అత్యవసర వినియోగానికిగాను ఈ వ్యాక్సిన్ గత సెప్టెంబర్‌లోనే అనుమతి పొందడం జరిగింది. యూఏఈ ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్, లీడర్స్, మినిస్టర్స్ మరియు హెల్త్ అఫీషియల్స్ ఇందుకు సమ్మతం తెలపడం జరిగింది. కాగా, రస్యాకి చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కి సంబంధించి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌కి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







