చట్టపరమైన గందరగోళంలో పెట్టుబడిదారులు
- February 19, 2016
పదేళ్ళ క్రితం ముచ్చట పడి కొనుగోలు చేసిన స్థలం ఇంకా తమ పేరిట రిజిష్ట్రార్ కాకపోవడంతో ఆ రియల్ ఎస్టేట్ పెట్టుబడీదారులు ఖంగుతిన్నారు. వారు ఈ స్థలాన్ని ఒక మాజీ షూరా మండలి సభ్యుడు వద్ద కొనుగోలు చేశారు. ఇప్పటకీ తమ పేరిట ఎందుకు రిజిష్ట్రార్ కాలేదని వాకబు చేయగా, స్థల విక్రేత కొంతకాలం క్రితం స్థానిక బ్యాంకు లో ఇదే స్థలాన్ని తనఖా పెట్టి రుణం పొందాడని తెలిసింది. దీంతో చట్టపరమైన చిక్కులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. దీంతో పెట్టుబడిదారులు చొరవ తీసుకొని మాజీ షూరా మండలి సభ్యుడు తీసుకొన్న అప్పును కట్టివేశారు. తర్వాత వారు అదే స్థలంలో 100 ఫ్లాట్ల భారీ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ ఫ్లాట్లను కొనుగోలుచేసిన వారి పేరిట రిజిష్ట్రార్ చేయాల్సిన క్రమంలో అ పనులకు ఉపక్రమించగా, మళ్ళీ ఈ ఫ్లాట్లు వారికి రిజిష్ట్రార్ కాలేదు. మరలా ఏమైందని విచారణ చేసిన పెట్టుబడిదారులకు తలపై మరో మొట్టికాయ పడింది. అదే మాజీ షూరా మండలి సభ్యుడు ఇంకా అదే బ్యాంకు కు, మరో 5 లక్షల బహెరిన్ దినార్లను చెల్లించాల్సి ఉన్నట్లు బ్యాంకు రికార్డులలో నమోది ఉంది. ఈ కారణం వల్ల ఆ స్థలం రిజిష్ట్రార్ కాదని తేలింది. దీంతో పెట్టుబడిదారులు స్థల విక్రేతను కలిసి ఈ పరిస్థితి గూర్చి నిలదీయాలని అక్కడకు వెళితే, ఆర్ధిక లావాదేవీలు తనను చికాకు పెడుతున్న నేపధ్యంలో మాజీ షూరా మండలి సభ్యుడు దేశాన్ని విడిచి, ఆచూకీ కనుగోనలేని మరో అజ్ఞాత దేశానికి వెళ్లిపోయినట్లు పెట్టుబడిదారులకు తెలియడంతో నిశ్చెస్టులయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







