ముగిసిన సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన...
- December 13, 2020
న్యూ ఢిల్లీ:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ టూర్ ముగిసింది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ మొదటి రోజు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్ లను కలిశారు. నిన్నటి రోజున పట్టణాభివృద్ధి శాఖ, పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరిని, ప్రధాని మోడీని కలిశారు. ప్రధాని మోడీతో కీలక విషయాలపై చర్చించారు. విభజన చట్టంలోని వివిధ అంశాలపైనా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, వరదల సాయంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల టూర్ ముగించుకొని ఈరోజు కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకుంటారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష