'ఆర్‌టీఎ' నంబర్‌ ప్లేట్ల ఆక్షన్‌ ఫిబ్రవరి 23న

- February 19, 2016 , by Maagulf
'ఆర్‌టీఎ' నంబర్‌ ప్లేట్ల ఆక్షన్‌ ఫిబ్రవరి 23న

38వ ఆన్‌లైన్‌ ఆక్షన్‌ ఫిబ్రవరి 23న ప్రారంభమవుతుంది. రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ లైసెన్సింగ్‌ ఏజెన్సీ, నాలుగు మరియు ఐదు సంఖ్యలు గల నెంబర్‌ ప్లేట్లను జె, కె, ఎల్‌, ఎం, ఎన్‌, ఓ, పి, క్యూ మరియు ఆర్‌ కోడ్స్‌ ద్వారా విడుదల చేస్తుంది. ఆర్‌టీఏ డైరెక్టర్‌ ఆఫ్‌ వెహికిల్స లైసెన్సింగ్‌ అథారిటీ సుల్తాన్‌ అల్‌ మర్జోకి మాట్లాడుతూ, నంబర్‌ ప్లేట్లపై ప్రత్యేక ఆసక్తి చూపేవారి కోసం ఈ ఆన్‌లైన్‌ ఆక్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. ఫ్యాన్సీ నెంబర్లను కోరుకునేవారు ఆక్షన్‌లో పాల్గొనాల్సింఇగా పిలుపునిచ్చారు. ఆర్టఇఎ పోర్టల్‌ లేదా దుబాయ్‌లోని కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా ఆక్షన్‌లో పాల్గొనే అవకాశం ఉంది. బిడ్డింగ్‌ స్టార్ట్‌ చేసే ముందు 5,000 దిర్హామ్‌లు డిపాజిట్‌ చెయ్యవలసి ఉంటుంది. గతంలో నిర్వహించిన ఆక్షన్‌ విజయవంతమైందనీ, ఈసారి ఆక్షన్‌ ఇంకా విజయవంతమవుతుందని అల్‌ మర్జోకి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com