యాపిల్ కంపెనీ క్షమాపణలు ..
- February 20, 2016
తమకు తెలిసిన మెకానిక్ తో హోమ్ బటన్ ను మార్పిడి చేసుకున్న ఐఫోన్ యూజర్లకు తాజాగా 'ఎర్రర్ 53' వస్తుండటంతో వారికి యాపిల్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. ఐఫోన్ల హోమ్ బటన్‌లో యాపిల్ 'టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ రీడర్' ఉంటుంది. పాస్వర్డ్ అవసరం లేకుండానే ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే, హోమ్ బటన్లు డ్యామేజ్ అవ్వడం వల్ల ఇటీవల ఐఫోన్, ఐప్యాడ్ లలో వాటిని స్థానిక మెకానిక్‌ల ద్వారా మార్చుకున్న వినియోగదారులకు.. ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ చేసుకునేటప్పడు.. 'ఎర్రర్ 53' అని వస్తుంది. దీంతో ఐఫోన్ షట్‌డౌన్ అయిఎంతకూ రీస్టార్ట్ కావడం లేదు.వేలమంది వినియోగదారులు ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే యాపిల్ కంపెనీ మాత్రం డివైస్ సెక్యూరిటీ కోసమే ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టామని చెప్పింది. ఈ ఫీచర్ విషయంలో ఎర్రర్ వస్తే యాపిల్ సపోర్ట్‌కు కాల్ చేసి.. సమస్య పరిష్కరించుకోవచ్చునని సలహా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించామని, అప్డేటెడ్ వెర్షన్ ఐవోఎస్‌లో ఈ సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని యాపిల్ తాజాగా ప్రకటించింది. ఈ సమస్య వల్ల ఇబ్బందిపడిన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







