బెండకాయలను నానబెట్టిన నీటిని తాగితే..
- December 14, 2020
బెండకాయలను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. చిన్న బెండకాయలు రెండు లేదా మూడు తీసుకుని వాటిని బాగా కడిగి చివరు, మొదలు కట్ చేసి తీసెయ్యాలి. బెండకాయలను నిలువుగా కట్ చేసి అవి మునిగేలా నీటిని పోయాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని నీటిలో ఉంచితే అవి బాగా నాని వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఉదయాన్నేబెండకాయ ముక్కల్ని తీసేసి ఆ నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. ఈ నీటిని తాగడం వలన మన పొట్టలోని పేగులు, జీర్ణాయాన్ని శుభ్రపరుస్తాయి. ఎసిడిటి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. బెండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. ఇంకా ఈ నీటిని తాగడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి హైబీపీ తగ్గుతుంది. గుండె పని తీరు మెరుగుపరిచేందుకు కూడ ఈ నీరు ఎంతో మేలు చేస్తుంది. టైప్2 డయాబెటిస్ ఉన్న వారు షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచడానిక బెండకాయ నీరు పనిచేస్తుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలు, జుట్టు రాలే సమస్యలను నివారిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







