తెలంగాణలో కొత్తగా 384 కేసుల నమోదు
- December 14, 2020
హైదరాబాద్: తెలంగాణ కొత్తగా 384 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. వీటిలో 101 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెలుగుచూశాయి. నిన్న కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటి వరకు ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 1,496కు పెరిగింది.
ఇక కొవిడ్‌కు చికిత్స పొందుతూ నిన్న 631 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,69,232కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 61,57,683 నిర్ధారణ పరీక్షలు చేయగా, గత రాత్రి 8 గంటల వరకు 28,980 మందిని పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,380 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 5,298 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







