బ్రిటన్‌లో కొత్త రకం కోవిడ్ వైరస్!
- December 15, 2020
జెనీవా: బ్రిటన్‌లో కొత్త రకం కోవిడ్ వైరస్ వెలుగులోకి వచ్చింది.కోవిడ్ వైరస్‌పై తమకు అవగాహన ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఇప్పటి వరకు వెయ్యి మందిలో దీన్ని గుర్తించినట్లు సమాచారం ఉందని తెలిపింది. ప్రస్తుత వైరస్‌కు భిన్నంగా ఇది వ్యవహరిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని పేర్కొంది. రోజులు గడిచే కొద్దీ కోవిడ్ వైరస్ మ్యుటేషన్ చెందుతోందని, ఇప్పటికే అనేక రకాల వైరస్‌లను గుర్తించామని డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారి మైఖేల్ ర్యాన్ పేర్కొన్నారు.
మరోవైపు, బ్రిటన్‌లో శరవేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులకు ఈ కొత్తరకమే కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో దీని వ్యాప్తిని అరికట్టేందుకు లండన్‌లో మూడో విడత ఆంక్షలు విధిస్తున్నట్టు ఆరోగ్యమంత్రి మ్యాట్ హాంకాక్ తెలిపారు. కాగా, ఫైజర్ అభివృద్ధి చేసిన కోవిడ్ వాక్సిన్ పంపిణీ గతవారమే బ్రిటన్‌లో ప్రారంభమైంది. తొలి విడతగా హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వృద్ధులకు ఇస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







