ANTI-DRUG DRIVE కార్యక్రమాన్ని ప్రాంభించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

- December 15, 2020 , by Maagulf
ANTI-DRUG DRIVE కార్యక్రమాన్ని ప్రాంభించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

మంగళగిరి:ఈ రోజు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యలయం లో ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ , అడిషనల్ డీజీపీ , సీఐడీ , పీవీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో "anti drug drive " ను వెబినార్ ద్వారా బ్యానర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సంధర్భంగా డి‌జి‌పి మాట్లాడుతూ వారం రోజులపాటు (15.12.2020 నుండి 22.12.2020) జరిగే "ANTI DRUG DRIVE " ను  సీరియస్ గా తీసుకుని ప్రజల్లో  అవగాహన కార్యక్రమలు, ర్యాలీ లు మరియు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ నిర్వహించాలని"చెప్పారు.ఇటీవల కాలంలో గంజాయిని ధ్వంసం చెయ్యడంలో మంచి పనితీరు ప్రదర్శించిన వైజాగ్ రూరల్ ఎస్పీ, శ్రీకాకుళం ఎస్పీ లను డీజీపీ గారు ప్రత్యేకంగా అభినందిస్తూ మిగతా ఎస్పీ లను కూడా ఆ విషయంలో చర్యలు తీసుకొమ్మని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ రవి శంకర్ అయ్యన్నార్ మరియు ఇతర అధికారులు , సీఐడీ నుండి డి.ఐ.జి లు  యస్.హరి కృష్ణ గారు,సునీల్ కుమార్ నాయక్ మరియు ఎస్పీలు పాల్గొనగా ... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రం లోని అన్ని జిల్లాల ఎస్పీలు , డి.ఐ.జి లు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com