CII- గ్రీన్ పవర్ పెర్ఫామెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్-2020 ను గెల్చుకున్న హైదరాబాద్ విమానాశ్రయం
- December 15, 2020
హైదరాబాద్: GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ “గ్రౌండ్ మౌంటెడ్ సోలార్” విభాగంలో ప్రతిష్టాత్మక CII - గ్రీన్ పవర్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2020ను గెలుచుకుంది. రెన్యూవబుల్ ఎనర్జీ (RE) కౌన్సిల్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) - గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (GBC) కలిసి డిసెంబర్ 1- 4, 2020 మధ్య నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును వర్చువల్‌గా ప్రదానం చేశారు.
5 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌లో సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకున్న కార్యలాపాలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. పలువురు పారిశ్రామిక ప్రముఖుల సమక్షంలో GHIAL సీనియర్ అధికారులు డిసెంబర్ 4న అవార్డులను అందుకున్నారు.
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి మరియు సమర్థత కార్యక్రమాలలో నిమగ్నమైన సంస్థలు, అవి వాటి రోజువారీ కార్యకలాపాలలో అనుసరించే ఉత్తమ పద్ధతులు, సాంకేతిక పురోగతిని ఈ CII వార్షిక ఫోరం గుర్తిస్తుంది. సోలార్ ప్లాంట్ సామర్థ్యం, వినూత్న ఆలోచన విధానం వంటి అనేక అంశాల ఆధారంగా జ్యూరీ సభ్యులు విజేతలను నిర్ణయిస్తారు.
శ్రీ ప్రదీప్ పణికర్, సీఈఓ, GHIAL “పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ సుస్థిరత పట్ల GHIAL నిబద్ధతకు ఈ పురస్కారం నిదర్శనం. సుస్థిర ఇంధనం పట్ల మా నిబద్ధతను ఈ పురస్కారం పునరుద్ఘాటిస్తుంది. సహజ వనరుల పరిరక్షణ విషయానికి వస్తే GHIAL రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అన్నవి మా మంత్రాలు. ఈ లక్ష్యం కోసం కట్టుబడి ఉన్న బాధ్యతాయుతమైన సంస్థగా, గ్రీన్ ఎనర్జీ రంగంలో మరియు కర్బన ఉద్గారాలను తగ్గించడంలో మా నిరంతర కృషిని కొనసాగిస్తాము. ” అన్నారు.
GHIAL అనుసరించే వివిధ ఇంధన సామర్థ్య పద్ధతులు పలు పారిశ్రామిక వేదికలపై ఇప్పటికే గుర్తించబడ్డాయి. గత మూడేళ్లుగా, GHIAL చేపట్టే ఇంధన సామర్థ్య చర్యల వల్ల ఇంధనం గణనీయంగా ఆదా అయింది. ఇది విమానాశ్రయంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి దారి తీసింది. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక కార్బన్ న్యూట్రల్ విమానాశ్రయం. ఇది ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) వారి ఎయిర్‌పోర్ట్స్ కార్బన్ అక్రిడిటేషన్ (ACI) కార్యక్రమం కింద నుండి లెవల్ 3 + “న్యూట్రాలిటీ” అక్రిడిటేషన్ కలిగి ఉంది.
GHIAL 2019 మరియు 2020 లలో CII యొక్క ప్రతిష్టాత్మక “నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు” ను కూడా గెలుచుకుంది. ఇది CII- GBC ల ప్రతిష్టాత్మక ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ – నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్లో 2017 నుండి క్రమం తప్పకుండా ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్ ట్రోఫీని గెలుచుకుంటోంది.

తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







