అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ
- December 15, 2020
న్యూ ఢిల్లీ:ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రహదారులు, ఆస్తి నష్టం గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు సహా నిధుల విషయంలో కాస్త జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను అమిత్ షా దృష్టికి సీఎం తీసుకువెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
పోలవరం ఆయకట్టు కింద పంటలకు 2022 ఖరీఫ్ సీజన్‌లో నీళ్లు అందించాల్సి ఉన్నందున వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరానికి సంబంధించి నిధులు విషయంలో జోక్యం చేసుకుని..ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్ అమిత్ షాను కోరారట.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







