బహుముఖ ప్రజ్ఞాశాలి డా.మృణాళినికి డా.వాసిరెడ్డి సీతాదేవి వంశీ జాతీయ పురస్కారం
- December 16, 2020
హైదరాబాద్:డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి వంశీ గ్రంధాలయం,వంశీ ఇంటర్నేషనల్ ఇండియా వ్యాలీ వేదిక అమెరికా,శారదా కళాసమితి విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, డాక్టర్ మృణాళిని కి డా.వాసిరెడ్డి సీతాదేవి వంశీ - జాతీయ సాహితీ పురస్కారం - 2020 డిసెంబర్ 15వ తేదీన అంతర్జాలంలో ప్రదానం చేస్తూ ముఖ్య అతిథిగా పాల్గొన్న డా కె వి రమణ సలహాదారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ " అనేక దేశాలలో పర్యటించి సాహిత్య సదస్సులలో పాల్గొని సిద్ధాంత పత్రాలు సమర్పించారనీ, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దీటుగా మాట్లాడగలరని, మృణాళిని కి తనచేతులమీదుగా వాసిరెడ్డి సీతాదేవి నెలకొల్పిన పురస్కారం అందజేయడం తనకు గర్వంగా ఉందని అన్నారు..సాహితీ పరివ్యాప్తి ఎంత ఉందో అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ ఎంత ఉందో వారికి అంతే ఉందని ప్రశంసించారు.. 1982 లో ఆమె రాసిన "మరీచిక" నవలను అప్పటి ప్రభుత్వం నిషేధించిందనీ, నిషేధించిన నవలా రచయిత్రిగా ఆమె పేరెన్నిక కలిగి ఉన్నారని, అధికారంలో ఉన్నంత కాలం ఇతరులకు ఎంత సాయం చేయాలని ఆలోచించిన మహిళావిదుషీమణి అని కొనియాడారు..."
వంశి వ్యవస్థాపక అధ్యక్షులు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ, 1972 నుంచి వంశీ సంస్థ కు, వాసిరెడ్డి సీతాదేవి గారితో ఉన్న అనుబంధం తెలియజేస్తూ పురస్కారాలకు దూరంగా ఉండే మృణాళిని, వాసిరెడ్డి సీతాదేవి అవార్డు స్వీకరించడం ఎంతో హర్షణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి నారాయణరావు జ్యోతి ప్రకాశనం చేశారు.. ప్రముఖ రచయిత్రులు డా. ముక్తేవి భారతి, వోల్గా, జలంధర చంద్రమోహన్, శారదా కళా సమితి అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు, వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సుంకర పల్లి శైలజ ,వ్యాలీ వేదిక వ్యవస్థాపకురాలు శారదా కాశీ వఝుల పాల్గొన్నారు.
సభలో రాధికా నోరి, రమా కంచి భట్ల ఆస్ట్రేలియా,ప్రియాంక మార్గాని, ఆస్ట్రేలియా,ఉషా చినుకుల ఆస్ట్రేలియా, లక్ష్మి శ్రీనివాస్ రామరాజు గుంటూరు, రామాంతపూర్ పబ్లిక్ స్కూల్ యాక్టివిటీ కాప్టెన్ అనఘాదత్త రామరాజు పాల్గొన్నారు..పాడనా తెలుగు పాట సంగీత విభావరి కార్యక్రమం ఆద్యంతం అందరినీ అలరించింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







