వారం రోజుల్లో వ్యక్తిగత పివో బాక్స్
- February 20, 2016
ఎమిరేట్స్ పోస్ట్ గ్రూప్ (ఇపిజి) 'మైహోం' సర్వీస్‌ని ప్రవేశపెడుతోంది. ఎంపిక చేయబడ్డ విల్లా కమ్యూనిటీస్‌లోని రెసిడెంట్స్ కోసం వ్యక్తిగత జీవో బాక్స్ సౌకర్యాన్ని కల్పించనుంది. దీనికోసం ఇపిజికి వినియోగదారులు అప్లికేషన్ పెట్టుకోవాల్సి వుంటుంది. ఇపిజి, విల్లాకి చెందిన కాంపౌండ్ వాల్ వద్ద ఇన్‌కమింగ్, అలాగే ఔట్‌గోయింగ్ కోసం ప్రత్యేకంగా మెయిల్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తుంది. పోస్ట్ మ్యాన్, ప్రతి రోజూ లేదా వారంలో మూడు రోజులు మెయిల్ బాక్స్‌ని చెక్ చేస్తారు. వినియోగదారుడే ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇపిజి చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఇబ్రహీమ్ బిన్ కరమ్ మాట్లాడుతూ, వినియోగదారులకు ప్రీమియమ్ సర్వీస్‌లో భాగంగా ఈ సౌకర్యం కల్పిస్తున్నామనీ, సబ్‌స్క్రైబర్స్‌కి డైరెక్ట్‌గా మెయిల్ సౌకర్యం కల్పించేందుకే ఈ సర్వీస్‌ని ప్రవేశపెట్టామన్నారు. ఎంపిక చేయబడిన ప్రాంతాల్లోని నివాసితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మైహోమ్ సర్వీస్‌లో ఫ్రీ ఇన్‌స్టాలేషన్, పిఓ బాక్స్ ఆన్‌లైన్ యాక్సెస్, వారంం వారం ఇషార్ ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన వివరించారు. 750 దిర్హామ్‌లు వారంలో మూడు రోజుల డెలివరీ కోసం, వారంలో ఆరు రోజుల డెలివరీ కోసం 1,250 దిర్హామ్‌లు చెల్లించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







