దోహా:భారత రాయబారి Dr.దీపక్ మిట్టల్ ను కలిసిన TWA టీం
- December 16, 2020
దోహా:దోహా లోని భారత రాయబారి Dr.దీపక్ మిట్టల్ ను భారత రాయబారి కార్యాలయంలో కలిసిన ఖతార్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ మేనేజ్మెంట్ కమిటీ. అసోసియేషన్ నిర్వహించే వివిధ కార్యక్రమాల గురించి రాయబారి వివరించింది కమిటీ.
తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ (TWA) అనే సంస్థ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఖతార్ లో నివసిస్తున్న తెలుగు వారికి ఎంతో చేరువయ్యింది. ఖతార్ మరియు తెలంగాణ ప్రభుత్వాలతో అనేక చర్చల తదుపరి ఈ సంస్థ తెలంగాణ నిర్వాసితుల కోసం తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ఒక స్థిరమైన కమిటీ ని ఏర్పాటు చేసుకొని అధికారికంగా రిజిస్టర్ చేయాలనే ఉద్దేశ్యంతో భారత రాయబారి కార్యాలయం ఖతార్ కింద ఉన్న ICBF ని సంప్రదించడం జరిగింది.
మేనేజ్మెంట్ కమిటీ మెంబెర్స్ ను రాయబారి కు పరిచయం చేసిన TWA ప్రెసిడెంట్ ఖాజా నిజాముద్దీన్,అసోసియేషన్ సంయుక్తంగా జరిపిన అన్ని కార్యక్రమాలను రాయబారికి వివరించటం జరిగింది. కరోనా మహమ్మారి సమయంలో లాక్ డౌన్ పరిస్థితులలో ప్రవాసులు పడుతున్న కష్టాలను దగ్గరుండి పరిష్కరించింది TWA టీం.
లాక్ డౌన్ సమయంలో TWA టీం అందించిన పలు సేవలు ఇలా...
1. భారత్ మరియు ఖతార్ లో రేషన్ పంపిణీ.
2. షుమారు 3500 మందికి పైగా వందే భరత్ మిషన్ లో భాగంగా స్వదేశానికి తిరిగి పంపడం జరిగింది. షుమారు 300 మందికి (తక్కువ జీతం ఉన్నవారికి ఇంకా డెబిట్/క్రెడిట్ కార్డు లేనివారికి ) టికెట్ బుకింగ్ కు ఆర్ధిక సాయం అందించటం జరిగింది.
3. TWA మహిళా విభాగం టికెట్స్ మరియు హోటల్ క్వారంటైన్ కొరకు సహాయం చేయడం జరిగింది.
4. ట్రావెల్ బాన్ ఉన్న ఫామిలీ కి హాస్పిటల్ బిల్ కట్టడానికి 3287 ఖతార్ రియాల్స్ ఇవ్వడం జరిగింది.
5. ఉపాధి కోల్పోయిన కార్మికులకు మార్గదర్శకత్వం ఇవ్వడం జరిగింది.
టీం వివరించిన పనులకు సానుకొల్లంగా స్పందించిన రాయబారి Dr.దీపక్ మిట్టల్, తగు సలహాలు సూచనలను కూడా ఇవ్వటం జరిగింది. భారత రాయబారి కార్యాలయం మరియు ICBF నుంచి పూర్తి సహకారం TWA Qatar కమ్యూనిటీ కి ఉంటుందని హామీ ఇచ్చారు మిట్టల్.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష