BEL లో ఉద్యోగావకాశాలు

- December 17, 2020 , by Maagulf
BEL లో ఉద్యోగావకాశాలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ఈ ప్రభుత్వ రంగ సంస్థ వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా మరో 131 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ట్రైనీ ఇంజనీర్-1, ప్రాజెక్ట్ ఇంజనీర్-1, ట్రైనీ ఆఫీసర్-1 తదితర పోస్టులు ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్-1 పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 35 వేల వరకు చెల్లించనున్నారు.

Trainee Engineer-I: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజినీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం 11 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం 19 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
Project Engineer-I
ఈ విభాగంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం 30 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింరగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం 10 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం 17 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం ఒక ఖాళీ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం రెండు ఖాళీలు ఉన్నాయి. ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వారి కోసం 1 ఖాళీ భర్తీ చేయనున్నారు.
నిరుద్యోగులకు ESIC శుభవార్త.. 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే
నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో రూ. 31 వేల వేతనంతో ఉద్యోగాలు

దరఖాస్తు చేసుకోవాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో https://jobapply.in/BEL2020GZBTEPE/ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు డిసెంబర్ 26ను గడువుగా నిర్ణయించారు. ఆ తేదీలోగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, OBC, EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులు ట్రైనీ ఇంజనీర్-1 పోస్టుకు దరఖాస్తుకు ఆన్లైన్లో రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్-1 పోస్టుకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com