డిసెంబర్ 25న నాని 'టక్ జగదీష్' ఫస్ట్ లుక్.!
- December 18, 2020
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న 'టక్ జగదీష్' సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ ఫిల్మ్‌లో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాని నటిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా 'టక్ జగదీష్' ఫస్ట్ లుక్‌ను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా హీరో నాని ప్రకటించారు. శుక్రవారం ఆయన 'టక్ జగదీష్'కు సంబంధించిన ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. అందులో రోట్లో పప్పు దంచుతున్న ఓ స్త్రీ చేయి కనిపిస్తోంది. ఆ పోస్టర్‌పై "The focus shifts on 25th Dec" అని రాశారు. దానికి "This Christmas #TuckJagadishFirstLook" అనే క్యాప్షన్ జోడించారు.
నాని హీరోగా నటించిన హిట్ మూవీ 'నిన్నుకోరి'తో పరిచయమై, రెండో సినిమా 'మజిలీ'తోనూ సూపర్ హిట్ సాధించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండటంతో 'టక్ జగదీష్'పై అంచనాలు భారీగా ఉన్నాయి. టైటిల్‌తోటే ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకు విడుదల చేసిన ప్రి లుక్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్‌తో సినిమాపై ఆసక్తి రెట్టింపవడం ఖాయమంటున్నారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ స్వరాలు కూరుస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్, జగపతిబాబు, రావు రమేష్, నరేష్
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







