CMYF ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ డ్రైవ్

- December 18, 2020 , by Maagulf
CMYF ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ డ్రైవ్

మస్కట్: మెగాస్టార్ చిరంజీవి అందించిన స్ఫూర్తితో ఒమాన్ లోని మెగా అభిమానులు సుమారు రెండు దశాబ్దాలుగా సేవా నిరతి తమ ఆశయంగా ప్రతి ఏటా మూడు నుంచి నాలుగు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వేల యూనిట్ల రక్తాన్ని మస్కట్ రక్తనిధి కి ఇచ్చి అవసర సమయాల్లో తెలుగు వారికే కాక భారతీయులకు కూడా ఎన్నోసార్లు ఒక్క వాట్సాప్ మెసేజ్ తో రక్తాన్ని సమకూర్చిన చరిత్ర CMYF (చిరు మెగా యూత్ ఫోర్స్ - మస్కట్) వారిది.    

రక్త దానాలతో పాటు, పలు సేవాకార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ, తెలుగు వారికి చేదోడువాదోడుగా ఉంటున్న సంస్థ CMYF. సుమారు 14 ఏళ్ళుగా ఈ సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలకు గాను CMYF ను సత్కరించింది ఒమన్ మినిస్ట్రీ అఫ్ హెల్త్.

నేడు బౌషెర్ బ్లడ్ బ్యాంకు (మస్కట్) నందు జరిగిన రక్త దాన శిబిరములో సుమారు  150మంది  తెలుగు వారు రక్త దానం చేశారు. కరోనా ప్రతికూల సమయంలో సైతం నిర్విఘ్నంగా పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరం నిర్వహించటంతో అందరి మన్నలను పొందారు శిబిరం నిర్వాహకులు చందక రామదాస్. ఈ సందర్భంగా చందక రామదాస్ మాట్లాడుతూ " తీసుకోవడము కన్నా  ఇవ్వడములో ఆనందము ఎక్కువ..అది డబ్బు అయినా,  ప్రేమ అయినా, రక్తము అయినా...ఈ కార్యక్రమానికి సహకరించిన మెగా అభిమానులకు ధన్యవాదాలు" అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com