మెస్మరైజింగ్ `హర్లా ఫర్లా` సాంగ్‌తో ఆకట్టుకుంటోన్న యాక్షన్ హీరో విశాల్ `చక్ర`
- December 19, 2020
హైదరాబాద్:యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `చక్ర`. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో హీరోయిన్ రెజీనా కసాండ్ర నటిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్నఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ మూవీ యాక్షన్ హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్‌రాజా కాంబినేషన్‌లో వస్తోన్న 10వ చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ చిత్రం నుండి యువన్ సంగీత సారథ్యం వహించిన `హర్లా ఫర్లా` సాంగ్`ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
`నీ చూపుల్లోనే నాటీ గ్రాఫిటీ.. రైసైందే లబ్‌డబ్ హార్టుల్లోని గ్రావిటీ..తాకేనా ఆ మేఘాల్ని..నా వలన నీ నవ్వుల్నే..కొట్టి కొట్టి కన్ను చంపమాకలా..కిక్కు రేపుతున్న మత్తు మాటలా..కొత్త కొత్తగున్న బుట్టబొమ్మలా హర్లా..ఫర్లా` అంటూ జోష్‌ఫుల్‌గా సాగే ఈ పాటకి డా. చల్లా భాగ్యలక్ష్మి నేటి ట్రెండ్‌కి తగ్గట్లు సాహిత్యం అందించగా రంజిత్, సంజన కల్‌మంజి ఫుల్ ఎనర్జీతో ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్ నేపథ్యంలో సరికొత్త కథాకథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ఈ మూవీ విడుదలకానుంది.
యాక్షన్ హీరో విశాల్, శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి : బాలసుబ్రమనియం, సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాత: విశాల్,రచన- దర్శకత్వం: ఎం.ఎస్ ఆనందన్.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







