టర్కీ కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
- December 19, 2020
అంకారా:టర్కీ దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలను కోల్పోయారు. దక్షిణ టర్కీలోని కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో శనివారం మంటలు చెలరేగాయి. ఆక్సిజన్ సిలిండర్ పేలి 9 మంది మృతి చెందారని ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు.
ఇస్తాంబుల్‌కు ఆగ్నేయంగా 850 కిలోమీటర్లు దూరంలోని గాజియాంటెప్‌లోని ప్రైవేటుగా నడుస్తున్న సాంకో యూనివర్శిటీ హాస్పిటల్ యూనిట్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగిందని ప్రభుత్వ అనడోలు వార్తా సంస్థ తెలిపింది. కరోనా బారినపడ్డ బాధితులు 56 నుంచి 85 మధ్య ఉన్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను త్వరగా అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









