జ‌న‌వ‌రిలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ..

- December 21, 2020 , by Maagulf
జ‌న‌వ‌రిలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ..

న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. క‌రోనాను పూర్తి స్థాయిలో క‌ట్ట‌డి చేసేందుకు భార‌త్ తో పాటు ప‌లు దేశాలు కూడా క‌రోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. భార‌త్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్ తుది ద‌శ‌లో ఉంది. వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. అయితే దేశ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే నెల‌లో క‌రోనా టీకా అందుబాటులోకి రానుంది. క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉందిన కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు. వ‌చ్చే నెల‌లో ఏ ద‌శ‌లోనైనా, ఏ వారంలోనైనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌చ్చ‌ని, దేశ ప్ర‌జ‌ల‌కు తొలి కోవిడ్ వ్యాక్సిన్ షాట్ ఇవ్వ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి వెల్ల‌డించారు. అయితే వ్యాక్సిన్ భ‌ద్ర‌త‌, స‌మ‌ర్ధ‌త త‌మ మొద‌టి ప్రాధాన్య‌త అని, ఈ విష‌యంలో ఎలాంటి వెన‌క్కి త‌గ్గే అవ‌కాశం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి ద‌ర‌ఖాస్తు
కాగా, దేశంలో అత్య‌వ‌స‌ర వినియోగానికి కొన్ని వ్యాక్సిన్ కంపెనీలు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయ‌ని మంత్రి చెప్పారు. వాటిని డ్ర‌గ్ రెగ్యులేట‌ర్ విశ్లేషిస్తున్నార‌ని అన్నారు. అయితే క‌రోనా వ్యాక్సిన్ ప‌రిశోధ‌న‌ల విష‌యంలో భార‌త్ ఏ దేశానికి తీసిపోలేద‌ని పేర్కొన్నారు. టీకా స‌మ‌ర్థ‌త‌, భ‌ద్ర‌త‌కు తాము అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని, దేశంలోని శాస్త్రవేత్త‌లు, ఆరోగ్య నిపుణులు స్వ‌దేశీ వ్యాక్సిన్‌పై ప‌ని చేస్తున్నార‌ని అన్నారు. వ‌చ్చే ఆరు నుంచి ఏడు నెల‌ల్లో దేశంలో 30 కోట్ల మందికి టీకాలు వేసే సామ‌ర్థ్యం తీసుకుంటామ‌ని మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు.

ప్ర‌యోగ ద‌శ‌లో 6 వ్యాక్సిన్లు
క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశంలో ఆరు కోవిడ్ వ్యాక్సిన్లు ప్ర‌యోగ‌ద‌శ‌లో ఉన్నాయిన అన్నారు. అందులో కోవీషీల్డ్‌, కోవాక్సిన్‌, జింకోవిడ్‌, స్పుత్నిక్‌, ఎన్‌వీఎక్స్ -కోవ్ 2373 టీకాలు ప‌రిశోధ‌న‌లో ఉన్నాయ‌ని అన్నారు. కాగా, ప్ర‌పంచ వ్యాప్తంగా మొద‌టిసారిగా వ్యాక్సినేష‌న్‌కు అనుమ‌తి ఇచ్చిన దేశంగా యూకే రికార్డుల్లో నిలిచింది. అత్య‌వ‌స‌ర వినియోగానికి ఫైజ‌ర్ టీకాకు బ్రిట‌న్ ప్ర‌భుత్వం గ‌త నెల‌లో అనుమ‌తించిన విష‌యం తెలిసిందే. అదే విధంగా అమెరికా ప్ర‌భుత్వం కూడా అత్య‌వ‌స‌ర వినియోగానికి ఫైజ‌ర్‌, మోడ‌ర్నా టీకాలు అనుమ‌తించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com