కువైట్ లో చిక్కుకున్న తెలుగు వాసులు

- December 23, 2020 , by Maagulf
కువైట్ లో చిక్కుకున్న తెలుగు వాసులు

కువైట్ సిటీ:ఏపీ,తెలంగాణ రాష్ట్రాల నుంచి కువైట్ వెళ్లిన కార్మికులకు అనుకోని కష్టాలు ఎదురయ్యాయి.వివరాల్లోకి వెళ్తే... 20  నెలల క్రితం వెళ్లిన తెలంగాణ, ఏపీకు చెందిన యువకులకు అకామా లేక అవస్థలు పడ్డారు.ఇంటికి రావడానికి  డబ్బులు లేక చేసిన భీమా ఎట్లా వాడాలో తెలియక ఇబ్బందులు పడ్డారు.ఈ సమస్యని గంగుల మురళీధర్ రెడ్డి చొరవతో ఎంబసీ ని ఆశ్రయించారు.

తెలంగాణ నిర్మల్ జిల్లా కు చెందిన కటారి సాజన్ లాల్ (31), దర్బార్ సింగ్ పెల్యా (25 ),గోపాల్ పెల్యా (24 ) , సుదర్శన్ పవార్(25 ) ,ఆదిలాబాదు జిల్లాకు చెందిన గంగారాం బాదావత్ (25 ) ,కరీంనగర్ కొనరావు పేట కు చెందిన  గోపాల్ మాలోతు (31 ) సారంగాపూర్ కు చెందిన రాజు కైరీ (34 ), రాజన్న సిరిసిల్ల కు చెందిన శ్రీనివాస్ గుడిపెల్లి (37 ) ,ఆంధ్రప్రదేశ్ ప.గో. కు  చెందిన  బాబీ కొనకళ్ల, మహేష్ కామన(25 )నాగరాజు పితాని (23 ) 20  నెలల క్రితం ఇఫ్కో టోకియో లో ఇన్సూరెన్స్ చేసుకుని కేవలం ఏజెంటు ఫీజు రూ. 20000  కట్టి  వెళ్ళవలసిన వీరు లక్ష ఇరవై వేలు అప్పు చేసి కట్టి వెళ్లారు. తీరా అక్కడి వెళ్ళాక పరిస్థితిలు వేరుగా మారాయి.నవంబర్  26న  మురళీధర్ రెడ్డి ని సంప్రదించగా రాయబార కార్యాలయ సహాయం కోరారు. అధికారులు సానుకూలం గా స్పంచింది సహకరిస్తున్నారు.అయితే భీమా చేసుకుని వెళ్లగలిగారు కానీ భీమా క్లెయిమ్ చేయడం రాక వీరు కష్టాలు పడ్డారు. భీమా కంపెనీలకు ఇది వరకు అనారోగ్యం కారణంతో వచ్చిన నగేష్ పాస్తం కొరకు తెలిపినా ఎటువంటి స్పందన రాలేదన్నారు.ఇందువల్ల అతను లక్ష భీమా కోల్పోయాడని. భీమా కు సంభందించిన కార్యాలయం ముంబై లో ఉండడం, భీమా చేసింది కూడా ముంబై లో ఉండడం వల్ల కూడా స్థానిక భీమా కార్యాలయ అధికారులు కూడా సహకరించ లేక పోయారు.ఈమెయిల్ వాట్సప్, ఫోన్ ద్వారా భీమా సంస్థ హాట్ లైన్ కు సంప్రదించిన తర్వాత ఫలితం లభించలేదు.

ఈ విషయం లో స్థానిక భీమా సంస్థ అధికారి కేవలం ఆన్ లైన్ ద్వారా గాని, హెల్ప్ లైన్ ద్వారా గాని సహకారం పొందమని తెలిపారు.

చివరిగా ఎంబసీ కి మరియు ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రంట్స్ అధికారికి ఈ బాధితులకు తగిన న్యాయం చేయాలని  ఈమెయిల్ ద్వారా పూర్తి వివరాలు జతపరుస్తూ  సహాయం కోరానని మురళీధర్ రెడ్డి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com