న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ డిసెంబర్ 31న థియేటర్‌లలో ‘ఒరేయ్ బుజ్జిగా..'
- December 23, 2020
హైదరాబాద్:యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా...`. ఈ చిత్రం నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31న థియేటర్‌లలో విడుదలవుతుంది. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ``న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర కానుకగా మా బ్యానర్ లో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను డిసెంబర్ 31న గ్రాండ్‌గా విడుదలచేస్తున్నాం. అంతే కాకుండా డిసెంబర్ లో రిలీజ్ అయిన మా బెంగాల్ టైగర్ బ్లాక్ బస్టర్ అయింది. బెంగాల్ టైగర్, పంతం.. ఇవన్నీ గురువారం విడుదల అయ్యి హిట్ అవడంతో, ఈ గురువారం డిసెంబర్ 31న రావడంతో 31న రిలీజ్ కన్ఫర్మ్ చేశాం. కొత్త సంవత్సరంలో అందరూ ధియేటర్స్ లో ఒరేయ్ బుజ్జిగా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. న్యూ ఇయర్ లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి చూడదగ్గ 100% ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఒరేయ్ బుజ్జిగా ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది.`` అన్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్,హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







