వలస గల్ఫ్ కార్మికుల పొట్ట కొట్టకండి

- December 23, 2020 , by Maagulf
వలస గల్ఫ్ కార్మికుల పొట్ట కొట్టకండి

మస్కట్:పొట్ట కూటి కోసం ఉపాధి అవకాశాలు వెతుకుంటు ఎడారి బాట పట్టే మన దేశ కార్మికుల కోసం కేంద్రం ప్రభుత్వం  ప్రోత్సహించడం పోయి కొత్తగా రూపొందించిన కనీస వేతనాల సవరణ కార్మికులను తీవ్రంగా నిరుత్సాహ పారిచేలా ఉంది అని టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రపంచమంతా కరోనా వణికిస్తు విదేశలో ఉన్న మన ప్రవాసియులు తీవ్ర ఇబంధులో ఉన్న సమయంలో కేంద్రం ఇలాంటి నిర్ణయలు తీసుకోవడం శోచనియంగా ఉంది అన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా జీతాలు  పెంచాల్సిన తరుణంలో కేంద్రం గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలు నియంత్రించేందుకు ఇటువంటి ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు కేంద్ర ప్రభుత్వని నిలదీసి తమ నైపుణ్యాలను చిన్నతనం చేసినందుకు  తీవ్రంగా ఖండించి ఈ ఉత్తర్వులు ఉపసంహరణ చేసేలా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అని
మహిపల్ రెడ్డి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com