వ్యోమగామి పోస్టులు దరఖాస్తులు: నాసా
- February 20, 2016
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో ఖాళీగా ఉన్న వ్యోమగామి పోస్టులు భర్తీ చేపట్టనున్నారు. ఇందుకోసం వ్యోమగాములు రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. ఏకంగా 18,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరిసారిగా 2012లో పిలిచినప్పుడు వచ్చిన దరఖాస్తులకు ఇది మూడు రెట్లు అధికం. 1978లో 8 వేల మంది స్పందించారు. ఇప్పటివరకూ అదే రికార్డు. తాజాగా అది బద్దలైందని నాసా అధికారులు వెల్లడించారు. 'విభిన్న నేపథ్యాలున్న ఇంత మంది దరఖాస్తు చేసుకోవడం నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ప్రతిపాదిత అంగారక యాత్ర కోసం వారు కూడా తమ వంతు పాత్ర పోషించాలనుకుంటున్నారు' అని నాసా అధిపతి చార్లీ బోల్డెన్ తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్నవారిలో 8 నుంచి 14 మంది మాత్రమే శిక్షణకు ఎంపికవుతారు.
ఇది వచ్చే ఏడాది మధ్య నాటికి పూర్తవుతుందన్నారు. 2011లో అంతరిక్ష షటిల్ కార్యక్రమానికి వీడ్కోలు పలికినప్పటి నుంచి అమెరికా వద్ద సొంతంగా మానవ సహిత యాత్రలు చేపట్టే వ్యోమనౌకలు లేవు. రష్యా మీదే ఆధారపడుతోంది. దీంతో ప్రస్తుతం వ్యోమగాముల సంఖ్య 47కు పడిపోయింది. షటిల్ యాత్రలు జోరుగా సాగుతున్నప్పుడు 2000 సంవత్సరంలో 149 మంది వ్యోమగాములు నాసాలో పనిచేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







