SBI SCO Recruitment 2021: ఎస్‌బీఐలో 489 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
- December 24, 2020
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 489 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు విభాగాల్లో ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులకు డిసెంబర్ 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 11 చివరి తేదీ. అభ్యర్థులకు ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 489
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO ఫైర్- 16
డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)- 28మేనేజర్ (నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్)- 12
అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 40
డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 60
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్)- 183
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- 17
ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్- 15
ప్రాజెక్ట్ మేనేజర్- 14
అప్లికేషన్ ఆర్కిటెక్ట్- 5
టెక్నికల్ లీడ్- 2
మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్)- 2
మేనేజర్ మార్కెటింగ్- 40
డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్- 35
దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 11
కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 జనవరి 22
రాతపరీక్ష- 2021 ఫిబ్రవరి 1
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







