వ్యాక్సినేషన్ ప్రారంభం: రెండో డోస్ వేసుకునేదాకా ప్రయాణాలొద్దు
- December 24, 2020
కువైట్: కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ఆరంభమయ్యింది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవాళ్ళకి రెండో వ్యాక్సిన్ తీసుకునేవరకూ ప్రయాణాలు చేయొద్దంటూ కువైట్ అథారిటీస్ సూచించాయి. మిష్రెఫ్లోని ఇంటర్నేషనల్ ఫెయిర్గ్రౌండ్స్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రైమ్ మినిస్టర్ షేక్ సబాహ్ అల్ ఖాలెద్ అల్ సబా వెల్లడించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏడాదిపాటు జరుగుతుందనీ, దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని హెల్త్ మినిస్టర్ షేక్ డాక్టర్ బాజెల్ అల్ సబాహ్ చెప్పారు. వ్యాక్సిన్ పొందగోరువారు హెల్త్ మినిస్ట్రీ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. మంగలవారం నాటికి 83,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతానికి దేశంలో 150,000 కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో వున్నాయి. ఇవి 75,000 మందికి సరిపోతాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష