లారెన్స్, బండ్ల గణేష్ కాంబినేషన్ హార్రర్ చిత్రం..
- February 21, 2016
బడా హీరోలతో చిత్రాలు నిర్మించి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా పేరొందిన బండ్ల గణేష్ మరో క్రేజీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. తమిళనాట హార్రర్ థ్రిల్లర్స్ తెరకెక్కించి బాక్సాఫీసు దగ్గర కనకవర్షం కురిపించిన రాఘవ లారెన్స్‌తో హార్రర్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు బండ్ల గణేష్. లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని బండ్ల గణేష్ తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోయే ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని..పూర్తి తారాగణాన్ని త్వరలోనే తెలియజేస్తామని గణేష్ అన్నారు. ఈ చిత్రానికి 'నాగ భైరవ' అనే టైటిల్ పరిశీలనలో ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







