దుబాయ్ లో ఉన్న రెహ్మాన్ తండ్రిని సొంత ఖర్చులతో స్వస్థలానికి చేర్చిన ఎమ్మెల్సీ కవిత
- December 27, 2020
తెలంగాణ:పెద్దపల్లి పట్టణానికి చెందిన బాలుడు ముతీర్ రెహ్మాన్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న ఏడు సంవత్సరాల వయసు గల రెహ్మాన్ వైద్యానికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న రెహ్మాన్, కోలుకుంటున్నాడు.పెద్దపల్లి లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత కి బాలుడు రెహ్మాన్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వివరాల్లోకి వెళితే...బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ, చావు బతుకుల మధ్య ఉన్న రెహ్మాన్ ను ఆదుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులు 19 జులై లో ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత ని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కవిత, రెహ్మాన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందిస్తానని భరోసా ఇచ్చారు. రెహ్మాన్ కు ఆపరేషన్ నిమిత్తం రూ. 2.5 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు ఎమ్మెల్సీ కవిత. అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రెహ్మాన్, దుబాయ్ లో ఉన్న తన తండ్రిని చూడాలని కోరగా... సొంత ఖర్చులతో రెహ్మాన్ తండ్రి గౌస్ బాబా ఇండియా వచ్చేలా ఎమ్మెల్సీ కవిత ఏర్పాట్లు చేశారు. ఇండియా చేరుకున్న గౌస్ బాబాకు క్వారంటైన్ లో ఉండేందుకు ఆర్థిక సాయం అందించారు ఎమ్మెల్సీ కవిత. ట్విట్టర్ ద్వారా కోరిన వెంటనే స్పందించి, రెహ్మాన్ అండగా ఉన్న ఎమ్మెల్సీ కవిత కి కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష