క్లినిక్ లో అబార్షన్: డాక్టర్ అరెస్ట్

- December 29, 2020 , by Maagulf
క్లినిక్ లో అబార్షన్: డాక్టర్ అరెస్ట్

సౌదీ: ప్రైవేటు మెడికల్ కాంప్లెక్సులోని క్లినిక్ లో అబార్షన్ నిర్వహిస్తున్న వలసదారుడైన వైద్యుడిని రియాద్ హెల్త్ డిపార్టుమెంట్ అదుపులోకి తీసుకుంది.  పలు రోజులుగా ప్రముఖ మెడికల్ కాంప్లెక్సులో ఈ వైద్యుడు అబార్షన్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఉల్లంఘన అని హెల్త్ అథారిటీస్ చెబుతున్నాయి. 7,000 రియాల్స్ తీసుకుని, నిందితుడు ఆపరేషన్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అత్యంత ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే అబార్షన్ నిర్వహించాల్సి వుంటుంది. దీనికి సంబంధించి అనేక నిబంధనలు వున్నాయి. ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com