జనవరి 31, 2021 వరకూ లాక్డౌన్ మార్గదర్శకాల పొడిగింపు
- December 29, 2020
న్యూఢిల్లీ: కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా సూచించిన మార్గదర్శకాలను జనవరి 31, 2021 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లపై ఎప్పటిలాగే నిఘా కొనసాగుతుందని తెలిపింది. నిబంధనలను కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా అమలు చేయనున్నట్లు పేర్కొంది. యూకేలో కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు హోం శాఖ సూచించింది. నవంబర్ 25న కేంద్ర హోం శాఖ, వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలనే జనవరి 31, 2021 వరకూ పాటించాలని కేంద్రం సూచించింది. ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా అందరూ వినియోగించాలని కోరింది. కంటైన్మెంట్ జోన్ల బయట 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లకు కేంద్రం అనుమతినిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







