కువైట్:రెసిడెన్సీ వయోలేటర్స్ కు క్షమాభిక్ష గడువు జనవరి 31వరకు పెంపు
- December 31, 2020
కువైట్ సిటీ:నివాస అనుమతుల గడువు ముగిసిన ప్రవాసీయులకు క్షమాభిక్ష గడువును పెంచింది కువైట్ ప్రభుత్వం. జనవరి 31 వరకల్లా దేశం విడిచి వెళ్లే వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని వెల్లడించింది. కువైట్లోని ప్రవాసీయుల రెసిడెన్సీ గడువుకు సంబంధించి కువైట్ ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన వాళ్లందరూ రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోవాలనుకున్నా...దేశం విడిచి వెళ్లాలనుకున్నా ఫైన్ చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. క్షమాభిక్ష గడువు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని ఆలోగా దేశం విడిచి వెళ్లినా..స్టేటస్ మార్చుకున్నా లీగల్ యాక్షన్ ఉండదని వివరించింది. అయితే.ఇప్పుడు మరోసారి క్షమాభిక్ష గడువును జనవరి 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత గడువు లోగా ఫైన్ చెల్లించి రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోకపోయినా...దేశం వదిలి వెళ్లకపోయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుందని కువైట్ హెచ్చరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష