వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అలీ
- December 31, 2020
ప్రముఖ నటుడు డాక్టర్ అలీ నిర్మాతగా అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కుతున్న సినిమా అందరు బాగుండాలి అందులో నేనుండాలి. మళయాలీ బ్లాక్ బస్టర్ సినిమా వికృతి ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో డాక్టర్ అలీతో పాటు ప్రముఖ నటులు డాక్టర్ విజయకృష్ణ నరేశ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మౌర్యాన్నీ హీరోయిన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా మొదలైన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారంగా ప్రకటిస్తామని డాక్టర్ అలీ తెలిపారు. అలానే కరోనా నేపథ్యంతో 2020లో అతలాకుతలమైన అందరి జీవితాలు రాబోయే 2021లో కోలుకోవాలని, ఈ కొత్త ఏడాది అందరికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ డాక్టర్ విజయకృష్ణ నరేశ్ తో కలిసి అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్, అందరు బాగుండాలి అందులో నేనుండాలి చిత్ర బృందం తరుపున డాక్టర్ అలీ ప్రేక్షకులకి శుభకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో డాక్టర్ అలీ మాటలతో శుభాకాంక్షలు తెలిపితే, డాక్టర్ విజయకృష్ణ నరేశ్ సైగల్ ద్వారా న్యూఇయర్ విషెస్ అందించారు. ప్రస్తుతం ఈ వీడియోకి సోషల్ మీడియాలో విశేషాదరణ లభిస్తోంది.
Let us throw this 2020 to a bin and welcome a fresh year without any hurdles this time. #HappyNewYear2021#AndarubagundaliAnduloNenundali
— Aliwood Entertainments (@aliwood_ent) December 31, 2020
#Ali & @ItsActorNaresh #Mouryaani
🎬 : #SripuramKiran
🎼 : @RakeshPazhedam@SivaMallala @IamEluruSreenu pic.twitter.com/TdHDtzOsiq
తారాగాణం:
డాక్టర్ అలీ, డాక్టర్ విజయకృష్ణ నరేశ్, మౌర్యానీ, పవిత్ర లోకేశ్ తదితరులు
టెక్నీషియన్లు:
బ్యానర్ - అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు - అలీబాబ, కొనతాల మోహనకుమార్
డిఓపి - ఎస్. మురళి మోహన్ రెడ్డి
సంగీతం - రాకేశ్ పళిడమ్
పాటలు - భాస్కరభట్ల రవికుమార్
ఎడిటర్ - సెల్వకుమార్
ప్రొడక్షన్ డిజైనర్ - ఇర్ఫాన్
ఆర్ట్ డైరెక్టర్ - కేవి రమణ
మేకప్ చీఫ్ - గంగాధర్
రచన, దర్శకత్వం - శ్రీపురం కిరణ్
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







