కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 16 మంది విదేశీయులకు జైలు శిక్ష
- December 31, 2020
మస్కట్: సుప్రీం కమిటీ సూచించిన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పదహారు మందికి జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. శిక్ష పడిన వాళ్లంతా విదేశీయులే. దోషులు అందరూ గ్యాంబ్లింగ్ ఆడేందుకు ఒకే చోట గుమి కూడటంతో పాటు కోవిడ్ నిబంధనలను పాటించకపోవటం, దోషుల్లో ఇద్దరు ఒమన్ చట్టాలను అధిగమించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. దోషుల్లో ప్రధాన నిందితుడు తన నివాసాన్ని గ్యాంబ్లింగ్ అడ్డాగా మార్చి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో ప్రధాన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మరో ఇద్దరిలో ఒకరు నివాస అనుమతి గడువు ముగిసినా రెన్యూవల్ చేసుకోలేదని, మరొకరు స్పాన్సర్ దగ్గర కాకుండా మరో చోట పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష పడగా..మిగిలిన 15 మందికి మూడు నెలల జైలు శిక్ష OMR500 ఫైన్ విధించింది కోర్టు. అలాగే శిక్షా కాలం పూర్తి కాగానే దోషులు అందర్ని దేశం నుంచి బహిష్కరించటంతో పాటు మళ్లీ వాళ్లు తిరిగి రాకుండా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







