'బ్రహ్మోత్సవం' షూటింగ్ చకచకా..
- February 22, 2016
ప్రిన్స్ మహేష్‌బాబు సినిమా 'బ్రహ్మోత్సవం' షూటింగ్ చకచకా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఫోటో అప్పుడే లీకయింది. మొత్తం కుటుంబమంతా కలిసి ఓ ప్రత్యేక పూజలో పాల్గొన్న సీన్ అది. హీరోయిన్లు సమంత, ప్రణీత ఇంకా షాయాజీ షిండే, మరికొంతమంది ఈ పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సన్నివేశమది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఏర్పాటు చేసిన స్పెషల్ సెట్లో దీన్ని చిత్రీకరించారు.డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక 'రోబో', 'వన్-నేనొక్కడ్నే' వంటి సినిమాలకు పని చేసి పాపులర్ అయిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బ్రహ్మోత్సవానికి తనవంతు చేయూతనిస్తూ దీని సక్సెస్‌కు కృషి చేస్తున్నాడు.ఈ మూవీ ఓవర్సీస్ హక్కులు అప్పుడే రూ.13 కోట్లకు అమ్ముడుపోయాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







