దుబాయ్ లో భారతీయుడి గిన్నిస్‌ రికార్డు

- January 03, 2021 , by Maagulf
దుబాయ్ లో భారతీయుడి గిన్నిస్‌ రికార్డు

దుబాయ్‌:దుబాయ్‌ లో నివాసముంటున్న ఓ భారతీయుడు భారీ గ్రీటింగ్‌ కార్డుతో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు. యూఏఈ పాలకుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ అధికారాన్ని చేపట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 8.2 చదరపు మీటర్ల భారీ గ్రీటింగ్‌ కార్డును చెన్నైకి చెందిన రాంకుమార్‌ సారంగపాణి రూపొందించినట్లు దుబాయ్‌ మీడియా వెల్లడించింది.దీనిని షేక్‌ మొహమ్మద్‌కు అంకితమిచ్చినట్లు తెలిపింది.

తాజా రికార్డుతో రాంకుమార్‌ ఖాతాలో 19 గిన్నిస్‌ రికార్డులు చేరాయి. యూఏఈ, భారత్‌ల్లో అత్యధిక గిన్నిస్‌ రికార్డులు నమోదు చేసిన వ్యక్తిగా రాంకుమార్‌ నిలిచినట్లు ఇక్కడి మీడియా వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com