పేరు మార్చుకోవాలనుకున్న సౌదీ మహిళలు ఇక సొంతంగా అప్లై చేసుకోవచ్చు
- January 03, 2021_1609679529.jpg)
రియాద్:సౌదీ అరేబియా మహిళలకు మరో గుడ్ న్యూస్. పేరు మార్చుకోవాలనుకుంటున్న మహిళలకు ఇక ఎవరి అనుమతి అవసరం లేదు. పేరు మార్చుకోవాలంటే ఇకపై గార్డియన్ సిఫార్సు లేకుండా వారే సొంతంగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సంబంధిత అధికారిక వెబ్ సైట్ ద్వారా మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతర్గత మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాల మేరకు ఓ వ్యక్తి తమ మొదటి పేరును మార్చుకునే వయసును 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు పెంచింది. నిబంధనల మేరకు తొలిసారి పేరు మార్పు కోసమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పాత పేరునే కొనసాగించాల్సి ఉంటుంది. ఇక కొత్త సవరణల ప్రకారం 18 ఏళ్లలోపు వయసు వారి పేర్లను మార్చాలంటే వారి తల్లిదండ్రులు, సంరక్షకులు, పవర్ ఆఫ్ అటార్నీ కలిగినవారి ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష