మొబైల్ ఫోన్ పోతే HawkEye appలో ఫిర్యాదు చేయండి-సీపీ అంజనీకుమార్
- January 03, 2021
హైదరాబాద్:మొబైల్ ఇప్పుడు మనిషికి నిత్యావసరంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే దాని ప్రాముఖ్యత అంతకంటే ఎక్కువే. చేతిలో మొబైల్ ఉంటే..ప్రపంచంలోని ఏం జరుగుతున్నా తెలిసిపోతుంది. ఇక మన వ్యక్తిగత ఫోటోలు, డేటా తదితరాలు అన్నీ ఫోన్‌లో నిక్షిప్తం చేస్తున్నాం. ఈ క్రమంలో పోయిన మొబైల్ ఫోన్‌లను..తిరిగి యజమానులకు అప్పగించడం చాలా అవసరమని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే HawkEye లాస్ట్ మొబైల్ ఫోన్‌లో కంప్లైంట్ చేసిన వాటిని ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఐడెంటిఫై చేసి.. వాటిని రికవరీ చేస్తున్నారు.
తాజాగా 35 కంప్లైంటులకు సంబంధించి రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌లను సీపీ అంజనీకుమార్ యజమానులకు అందించారు. 2015లో ప్రారంభమైన HawkEye యాప్ అప్లికేషన్ ప్రారంభమైంది. అప్పట్నుంచి దాదాపు 500 మొబైల్ ఫోన్‌లను గుర్తించి వాటిని తిరిగి యజమానులకు అందించినట్లు పోలీసులు తెలిపారు.మొబైల్ ఫోన్ పోతే.. వెంటనే HawkEyeలో కంప్లైంట్ చేయాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!