తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- January 04, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 238 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 518 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ఇక, మరో ఇద్దరు కరోనాతో మృతిచెందారు.. దీంతో.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,740కు చేరుకోగా.. ఇప్పటి వరకు 2,81,083 మంది రికవరీ అయ్యారు.. మృతుల సంఖ్య 1551కి పెరిగింది... మరోవైపు.. దేశంలో కరోనా మరణాలశాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పరిమితం అయ్యింది.. రికవరీ రేటు దేశ్యాప్తంగా 96.2 శాతం ఉంటే.. రాష్ట్రంలో 97.68 శాతానికి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,106 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 2,942 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. అయితే, ఆదివారం కావడంతో నిన్న కరోనా టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గిపోయింది.. కోవిడ్ బులెటిన్ ప్రకారం 27,077 శాంపిల్స్ పరీక్షించారు.. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 70,18,564కు చేరింది. తాజా కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 60 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 26, వరంగల్ అర్బన్‌లో 20, మల్కాజ్‌గిరిలో 15 కొత్త కేసులు వెలుగు చూశాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









