పన్నీర్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

- January 04, 2021 , by Maagulf
పన్నీర్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

మనం వాడే ప్రతీ ఆహార పదార్థానికీ రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వాటిలో భారతీయులు‌ ఎక్కువగా వాడువి. ఎంతోటేస్టీగా ఉండే పన్నీరుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

  • కాన్సర్ర్లలో ఎక్కువ మందికి సోకుతున్న రొమ్ము కాన్సర్ నుంచి మనల్ని కాపాడుతుంది పన్నీర్‌.
  • పాల ఉత్పత్తి అయిన పన్నీర్‌లో ఉండే వాల్షియం, విటమిన్‌ డి, రొమ్ము కెన్సర్‌ను దూరం చేస్తాయి.
  • గుండెకు ఎంతో మంచిది, రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌ని కంట్రోల్‌ చేస్తుంది. పన్నీర్‌లో ఉండే మెగ్నీషియం క్యాటలిస్టులా పనిచేస్తుంది. జీవ రసాయనిక చర్యల్ని ప్రోత్సహిస్తుంది.
  • బాడీలోని వివిధ రకాల ఎంజైమ్‌లను యాక్టివేట్‌ చేస్తుంది. కండరాలు మరియు నాడుల పనితీరు నిర్వహిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
  • పన్నీర్‌ ఎముకలకు బలాన్ని ఇస్తుంది. మనకు రోజూ అవసరమ య్యే కాల్షియంలో 8% దీని ద్వారా లభిస్తుంది. ఇది పిల్లల, పెద్దల్లో ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది. గర్భవతులైన మహిళలకు అత్యుత్తమైన ఆహారం పన్నీరు.
  • పన్నీర్‌లో ఉండే ఎక్కువగా ఉండే ప్రోటీన్‌లు శాఖాహారులకు శక్తినిస్తాయి. పన్నీరులో ఫాస్పరస్‌, ఫాస్పేట్‌లు జీర్ణక్రియను మెరుగుపరచి.. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసి, వాటిని వెలికి తీయడానికి సహాయపడతాయి.
  • పన్నీర్‌లో ఉండే వే ప్రోటీన్‌.. ఎంతో ఆరోగ్యవంతమైనది. ప్లేయర్లు, ఎక్సర్‌సైజ్‌లు చేసేవారికి ఇది మేలు చేస్తుంది. ఇది చాలా నెమ్మదిగా జీర్ణం అవుతూ, నెమ్మదిగా శక్తిని ఇస్తుంది. అందువల్ల అథ్లెటిక్స్‌, బాడీ బిల్డర్‌లు, స్ప్రింటర్‌లు, ఆటలు ఆడేవారికి ఇది ఎంతో మేలైన ప్రోటీన్‌.
  • పన్నీర్‌లో ఉండే జింగ్‌ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికీ, జీర్ణక్రియకు, షుగర్‌ని కంట్రోల్‌ చెయ్యడానికీ, టెన్షన్లను తట్టు కోవడానికీ ఉపయోగపడుతుంది.
  • రేచీకటిని నిరోధిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలి లేకపోవడాన్ని నిరోధిస్తుంది. అలాగే ప్రొస్టేట్‌ రుగ్మతలను పోగొట్టి, వివిధ రకాల అంటువ్యాధులకు విరుద్ధంగా పోరాడుతుంది.
  • పన్నీర్‌లో పొటాషియం కూడా ఉంటుంది. ఇది బాడీలో ద్రవ నియంత్రణ పదార్థాంగా పనిచేస్తుంది. కండరాలు, బ్రెయిన్‌లో ముఖ్యమైన పదార్థాం. రెగ్యులర్‌గా పన్నీరు తింటే బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం తుగ్గుతుంది.
  • సెలీనియం ఎక్కువగా ఉండే పన్నీరును వంటల్లో వేసుకొని తినడం వల్ల.. మన శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా ఉంటాయి.
  • అలాగే రకరకాల వ్యాధుల నుంచీ తప్పించుకోవచ్చు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com