తెలంగాణా హోం మినిస్టర్ గారి సమక్షంలో జెఇపి, టామ్‌కామ్ మధ్య 'ఎంఓయూ'
- February 22, 2016
జజీరా ఎమిరేట్స్ పవర్ (జెఇపి) మరియు తెలంగాణ ఓవర్సీస్ మేన్ పవర్ కంపెనీ (టామ్‌కామ్) మధ్య ఎంఓయూ కుదిరింది. జెఇపి హెచ్ఆర్ మేనేజర్ ఎన్.తిరుపతిరెడ్డి మరియు టామ్‌కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వై.నాయక్ (ఐఏఎస్) ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి మరియు కిషోర్ బాబు దువ్వూరు సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. జెఇపి మేనేజింగ్ డైరెక్టర్ దువ్వూరు కిషోర్‌బాబు, తెలంగాణ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ హర్‌ప్రీత్‌సింగ్, తెలంగాణ ప్రిన్సిపల్ హోం సెక్రెటరీ రాజీవ్ త్రివేది టామ్‌కామ్ జనరల్ మేనేజర్ భవానీ, జెఇపి, టామ్‌కామ్ కో-ఆర్డినేటర్, ఫెసిలిటేటర్ వై.శ్రీనివాస్‌శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెఇపి - టామ్‌కామ్ మధ్య అవగాహన, వివిధ క్యాటగరీల ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినవారికి టామ్‌కామ్ ద్వారా రిక్రూట్మెంట్ వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. కిషోర్‌బాబు దువ్వూరు గారు హోం మినిస్టర్ మరియు సీనియర్ ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని మర్యాదపూర్వంగా కలిసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు గురించి వివరించగా, దానికి జెఇపి నుంచి సానుకూల స్పందన రావడం జరిగాయి. తెలంగాణ యువతకు జెఇపి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో అవకాశాలు ఈ ఒప్పందంలో ముఖ్యమైన అంశం. యూఏఈ సహా పలు గల్ఫ్ దేశాల్లో జెఇపి గ్రూప్‌కి అనేక కంపెనీలున్నాయి.








తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







